భద్రా కళ్యాణం కొన్ని రోజుల ముందు నన్ను రసాయన శాస్త్ర అధ్యాపకుడు రాజశేఖర్ రెడ్డి వారి ఊరు దిగువ చెర్లోపల్లి కి ఆహ్వానించాడు. దుర్గాష్టమి రోజు తమ ఊరి వద్ద ఉన్న E గంగిరెడ్డి పల్లి చెరువు కట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడి లో ఆకుపూజ చేస్తున్నాము రండి అని చెప్పాడు. అలాగే అని ఒప్పుకున్నాను. ఎలాగూ సెలవులు కదా!!! ఆరోజు అనుకున్నట్టుగా నేను, మనోహర్ నాయక్, అహ్మద్ మరియు శ్యామూ కారులో కొత్త చెరువు వైపు బయలుదేరాము. ఉదయం 7 కు మనోహర్ కారులో బయలుదేరిన మేము, అల్పాహారం కోసం ధర్మవరం లో ఉన్న బృందావనం హోటల్ కు వెళ్లాము. అక్కడ ఇడ్లీ, వడ మరియు మసాలా దోసె తిన్నాము అందరం. చాలా సంవత్సరాల తరువాత మంచి మసాలా దోసె తిన్న ఫీల్ వచ్చింది నాకు. తరువాత అక్కడ నుంచి కొత్త చెరువు చేరి, అక్కడి నుంచి GPS సహాయంతో E గంగిరెడ్డి పల్లి చెరువు కట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చేరాము. అప్పటికే రాజశేఖర్ రెడ్డి, శిష్యుడు రాకేశ్ తో అక్కడ వేచి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రమాణాలకు ప్రసిద్ది అని తెలిసింది. చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి పరుచుకుని ఉంది. రాకేశ్ సహాయంతో గుడి వద్ద ఉన్న గుట్ట మీదకి కొద్దిగా ఎగబాకాము. ఆ గుట్ట మీద...
Posts
- Get link
- X
- Other Apps
YOUTH TRAINING ACTIVITIES ఈ రోజు అనుకోకుండా ఊపిరి సలపని కార్యక్రమాలతో ముగిసింది. ఉదయం 9 గంటలకు ప్రిన్సిపల్ మేడం పద్మ శ్రీ గారి ముందస్తు అనుమతి తీసుకుని, ANSET బృందం సునీల్ కుమార్ రెడ్డి మరియు చిగిచెర్ల శ్రీనివాసులు గారితో కలిసి బి. పప్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో యువతకు కావలసిన జీవన నైపుణ్యాల మీద అవగాహన కల్పించాము. తరువాత నార్పల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బాలప్ప గారిని, బాటనీ లెక్చరర్ మురళి ని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల చరవాణి నెంబర్ లను ఇవ్వమని అభ్యర్థించాము. ఈ కళాశాలలోనే ఇంటర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చాము. ఈ కార్యక్రమాలకు సంబంధించినవే ఈ క్రింది ఫోటోలు.
- Get link
- X
- Other Apps
Release of Mega Supplementary Results & Other Events on 17th June 2025 ఈరోజు మా కళాశాల లో కొన్ని events అలా.. అలా.. జరిగిపోయాయి. ఉదయం 10 గంటలకు ప్రిన్సిపల్ పద్మ శ్రీ, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరీక్షా విభాగం డైరెక్టర్ రమణ గారు మరియు మా పరీక్షా విభాగధిపతి mega supplementary మరియు 6 వ సెమిస్టర్, పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. తరువాత మరమ్మత్తులు చేసుకుంటూ, అతి సుందరంగా రూపు దిద్దుకుంటున్న ఫిజిక్స్ workshop గదిని, విద్యార్థినుల waiting hall ని పరిశీలించడానికి వెళ్లాము. ఆ సమయంలోనే రూమ్ నెంబర్ 13 లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే, ఆ ప్రొడక్షన్ యూనిట్ ను పలుకరించి వచ్చాము. ఈ రోజుకు ఇంతే. శుభం. మరో విషయం ఏమంటే, ఈ రోజు నేనో మంచి పని చేసాను. జీవన్ దాన్ ట్రస్ట్ వెబ్ సైటు లోకి వెళ్లి అవయవ దాతగా పేరు నమోదు చేసుకున్నాను. చచ్చి కూడా బతకాలి అంటే దీని ద్వారా మాత్రమే సాధ్యం. ఈనాడు ఆధ్వర్యంలో మా కళాశాలలో జరిగిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆర్ట్స్ కళాశాలలో అందుబ...
- Get link
- X
- Other Apps
సంచారి ఇక వేసవి సెలవులు ముగిసిపోతూ ఉన్నాయి. ఈ వేసవి సెలవులకు ఇదే చివరి ఆదివారం. కొన్ని కారణాల వల్ల ఈ వేసవి సెలవులలో ఎక్కడా తిరిగిందే లేదు. తిరగలేక పోయాను అని బాధ పడుతుండగానే, అమెజాన్ ద్వారా "సంచారి" మా ఇంటికి వచ్చాడు. అదేనండీ పెద్దింటి అశోక్ కుమార్ రచించిన "సంచారి" నవల మా ఇంటికి చేరింది. సాయంత్రం నుంచి చదవడం మొదలెడదాము అనుకున్నాను. నిత్య సంచారి అయిన అతిథిని సంధ్య వేళ వరకు వేచి ఉండేలా చేయడం ధర్మం కాదనిపించి అనుష్టానం అయిన వెంటనే చదవడానికి ఉపక్రమించాను. మనది కాని జీవితం మనకు ఆసక్తిని కలుగజేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు సంచారాలు ఇష్టం. కానీ ఇష్టమైనవన్నీ నెరవేరవు. ఆశలు నెరవేరవు. ఆశయాలు మాత్రమే నెరవేరుతాయి. నా సంచార వ్యామోహం అనేక కారణాల వలన ఆశయంగా బలం పుంజుకోలేక పోయింది. నాలో అంతర్గతంగా ఉన్న చాలా భయాలు కూడా నన్న...
- Get link
- X
- Other Apps
తేనెపూల మీద తుమ్మెద – కవితాంతరంగ పరామర్శ మీద స్పందన తూముచెర్ల రాజారామ్ గారు తను రాసిన “తేనేపూల మీద తుమ్మెద – కవితాంతరంగ పరామర్శ" అనే పుస్తకం మీద సమీక్ష చేయమన్నప్పుడు దానికి నేను అర్హుడినా అని ఆలోచించాను. “పుస్తకం చదివిన తరువాత మీకేమి అనిపించిందో చెప్పండి చాలు” అని రాజారామ్ గారు చెప్పిన తరువాత ‘హమ్మయ్య’ అనుకున్నాను. నేను కథల గురించి సమీక్షించిన సందర్భాలు ఉన్నాయి గానీ కవిత్వం మీద, అందునా కవిత్వం మీద వచ్చిన విమర్శనా గ్రంథాల మీద ఇంతవరకు సమీక్ష చేయలేదు. కానీ “తేనేపూల మీద తుమ్మెద – కవితాంతరంగ పరామర్శ" చదువుతుంటే విమర్శకుడు కవి యొక్క ఆత్మను ఆవిష్కరించే పనిముట్టు అని అర్థం అయ్యింది. విమర్శకుడు లేకుంటే, కవిత్వం చదువుతున్న పాఠకుడు కవిత్వం అనే పద్మ వ్యూహం లో దారీ తెన్ను కానకుండా పరిభ్రమిస్తాడు. కవి ఆవిష్కరించాలనుకున్న భావనామయ చిత్రాలు పాఠకుడి ముందు సరిగా రూపు కట్టవు. దీనికి కారణం కవి మరియు పాఠకులు భిన్న నేపథ్యాల నుంచి రావడమే. కవిత్వాన్ని రాయడం కంటే, దానిని విమర్శించడం కష్టం. ఒక కవిత్వానికి సామాజిక, తాత్విక, చారిత్రక మరియు వైయక్తిక కోణాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వ...
- Get link
- X
- Other Apps
నుడి - నానుడి సమీక్ష మా కాలేజీ కి వెళ్లేటప్పుడు దానికి దగ్గరగా ఉన్న విశాలాంధ్ర లోకి తరచూ తొంగి చూస్తుంటాను. అలాగే ఒక రోజు తొంగి చూసిన నన్ను తిరుమల రామచంద్ర గారు రాసిన "నుడి- నానుడి" అనే పుస్తకం ఆకర్షించింది. ఇక ఏమీ ఆలోచించకుండా కొనేసాను. ఆయన రాసిన హంపీ నుంచి హరప్పా దాకా రెండు సార్లు చదివాను. నేను నిత్య పారాయణ గ్రంథాలు తప్ప ఏ పుస్తకం రెండు సార్లు చదివింది లేదు. కానీ హంపీ నుంచి హరప్పా దాక పుస్తకం లో ఉన్న శైలి ఆ పుస్తకం రెండో సారి చదివేలా ప్రేరేపించింది. అప్పుడే తెలిసింది తిరుమల రామచంద్ర గారు బహు భాషావేత్త అని. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన గొప్పతనం తెలియదు. తరువాత నేను సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధం అవుతున్నప్పుడు తెలుగును ...
- Get link
- X
- Other Apps
దాసప్ప గాని మనవడు - మరి కొన్ని కథలు అశేరా రచించిన "దాసప్ప గాని మనమడు - మరి కొన్ని కథలు" ఛాయా బుక్. కాం నుంచి తెప్పించుకుని మరీ చదివాను. నాకెందుకో పుస్తకాలను ఇప్పించుకుని చదివే అలవాటు లేదు. తెప్పించుకుని చదివే అలవాటే ఉంది. నా దృష్టిలో రచయిత అంటే ఒక ఋషి. అతను రచించిన పుస్తకం చదవడం అంటే ఋషి ఋణం తీర్చుకోవడం లాంటిదే. ఈ పుస్తకం లో మొత్తం ఐదు కథలు ఉన్నాయి. పుస్తకం మొదట్లోనే కథలు ఎందుకు పుడతాయో, ఎలా పుడతాయో చక్కగా వివరించారు రచయిత. కథ ఎవరిదైనా కావొచ్చు , ప్రతి కథలో కూడా ఆదిమ కాలం నుంచీ, నేటి కాలం వరకు కాల గర్భంలో కలిసి పోయిన వివిధ వ్యక్తిత్వాలు తొంగి చూస్తాయి అని రచయిత పేర్కొంటారు. నేల విడిచి సాము చేయడం కవిత్వానికి చెల్లుతుందేమో కానీ కథకు కాదు. ఈ కథల ప్రధాన ఉద్దేశ్యం సంస్కరించకుండా వదిలేసిన అనేక అమానవీయ పోకడల ఖండన. కథలో వాడిన మొరుసునాడు మాండలిక పదజాలం కథ లోని సన్నివేశాలకు ఔచిత్యాన్ని జోడించింది. ఈ దాసప్ప గాని మనమడు కథలో దాసరి రామాంజనేయులు మనవడు రమేషుడిది ప్రధాన పాత్ర. గడ స్తంభం పట్టుకుని, ముఖం నిండా తిరు నామాలు దిద్దుకుని 'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రాన్న...