Posts

Showing posts from February, 2025
Image
                                                              ఒంగోలు ప్రయాణం  అధ్యాపకులందరము విద్యార్థి దశలోకి వెళ్ళిపోయిన అనుభూతి ఈ రోజు వచ్చింది. Association elections  రాష్ట్ర స్థాయిలో ఒంగోలు సక్కూ భాయి మహిళా డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 9, 2025 న జరగబోతున్నాయి. ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అనంతపురం జిల్లా నుంచి 30 మంది  వరకు అధ్యాపకులు ఒంగోలుకు ఫిబ్రవరి 8 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరాము. ప్రయాణానికి ఏర్పాటు చేసిన బస్సు చాలా సౌకర్యవంతంగా ఉంది. నేను అందరికంటే ముందుగా వెళ్లి సింగల్ సీట్ లో కూచుండి పోయాను. చేతిలో ఒక బ్యాగ్ తప్ప ఎవరికీ పెద్ద లగేజ్ లేదు. బస్సు ఎక్కడానికి ముందే అందరూ blissful mood లోకి వచ్చేసారు. ఈ టూర్ మొత్తం మనోహర్ రెడ్డి, శేషయ్య మరియు సోమశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తోంది. బయలుదేరడానికి ముందు రోజే నేను గూగుల్ లో ఒంగోలు చుట్టుపట్ల ఉన్న ప్రదేశాల గురించి వెతికి పట్టుకున్నాను. ఎక్కడికి ...
Image
ఫిబ్రవరి 2 , 2025  నాకు ఒక మరపురాని మధురానుభూతిని పంచింది. దానికి కారణం నేను రాళ్లపల్లి లో జరగబోతున్న రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడమే.  నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినది రాళ్లపల్లి వాస్తవ్యుడైన కృష్ణ మోహన్ రెడ్డి. ఈయన ఇంజనీర్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే, గ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నారు. కృష్ణ మోహన్ గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వెంటనే నేను ఎగిరిగెంతేసి ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి పేరు వింటూనే ఉన్నాను. ఆయన నా బాల్యం లో మా ఇంటికి వచ్చేవారని మా తాత చెప్పేవారు. నేను మరీ చిన్న వాడిని కావడంతో ఆయనను భౌతికంగా చూసిన గుర్తుకులేదు. నేను ఇంటర్ లో ఉండగా మా తెలుగు పాఠ్య పుస్తకం లో రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రాసిన 'నిగమ శర్మ అక్క' పాఠం ఉండేది. దానిలో ఉన్న 'పరిహాసము పవిత్ర వస్తువును కూడా గమనించదేమో' అనే వాక్యం నాకిప్పటికీ గుర్తు. అదే విధంగా నేను తిరుపతి లో ఉన్నప్పుడు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు అన్నమయ్య సంకీర్తనలలో 108 కీర్తనలకు సంగీతాన్ని...