Release of Mega Supplementary Results & Other Events on 17th June 2025 



ఈరోజు మా కళాశాల లో కొన్ని events అలా.. అలా.. జరిగిపోయాయి. ఉదయం 10 గంటలకు ప్రిన్సిపల్ పద్మ శ్రీ, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరీక్షా విభాగం డైరెక్టర్ రమణ గారు మరియు మా పరీక్షా విభాగధిపతి mega supplementary మరియు 6 వ సెమిస్టర్, పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. తరువాత మరమ్మత్తులు చేసుకుంటూ, అతి సుందరంగా రూపు దిద్దుకుంటున్న ఫిజిక్స్ workshop గదిని, విద్యార్థినుల waiting hall ని పరిశీలించడానికి వెళ్లాము. ఆ సమయంలోనే రూమ్ నెంబర్ 13 లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే, ఆ ప్రొడక్షన్ యూనిట్ ను పలుకరించి వచ్చాము. ఈ రోజుకు ఇంతే. శుభం. 


మరో విషయం ఏమంటే, ఈ రోజు నేనో మంచి పని చేసాను. జీవన్ దాన్ ట్రస్ట్ వెబ్ సైటు లోకి వెళ్లి అవయవ దాతగా పేరు నమోదు చేసుకున్నాను. చచ్చి కూడా బతకాలి అంటే దీని ద్వారా మాత్రమే సాధ్యం. 





ఈనాడు ఆధ్వర్యంలో మా కళాశాలలో జరిగిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉన్న 41 డబల్ మేజర్ కోర్సు ల గురించి, వాటిలో ప్రవేశం గురించి ప్రిన్సిపల్ పద్మ శ్రీ, IQAC Coordinator జితేంద్ర, శర్మిలా మేడం, ఉదయ భాస్కర్, అహమ్మద్ మరియు జువాలజీ అధ్యాపకుడు G L N ప్రసాద్ అవగాహన కల్పించారు. జూన్ 19, 2025 న  సుమారు గంట పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో 35 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

Comments

Popular posts from this blog