Posts

Showing posts from January, 2025
Image
                                                        తిరుపతి తో నా అనుబంధం  తిరుపతి లో నేను రెండు విడతలుగా సుమారు పదిహేను సంవత్సరాల పాటు నివాసం ఉన్నాను. మొదటిసారి 1991 నుంచి 1995 వరకు ఉన్నాను. తరువాత 1999 నుంచి 2010 వరకు రెండో విడత ఉన్నాను. ఇంత కాలం పాటు తిరుపతి లాంటి పుణ్య క్షేత్రంలో నెలవు ఉండడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఆదిత్య పురాణం లో చెప్పిన  ' వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనా- వెంకటేశ సమో దేవా నభూతో న భవిష్యతి ' అనే ప్రమాణం నాకు జీవితంలో అనుభూతిలోకి వచ్చింది.  చిన్నప్పటి నుంచి మా కుటుంబానికి తిరుమల శ్రీవారి ని దర్శించడం రివాజు. ఇంచు మించు డిగ్రీ చదువుకునే వరకు నేను ఏదో ఒక రకంగా, ఎవరో ఒకరితో ఏడాదికి ఒకసారి చొప్పున శ్రీవారి దర్శనం చేసుకుని ఉంటాను. మా ఇలవేల్పు వెప్రగల్ నరసింహ స్వామి. దీనిని ఇప్పుడు విప్రమల అంటున్నారు. రాయదుర్గం దగ్గరగా ఉన్న క్షేత్రం ఇది. కానీ మాకు కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని ...
Image
                                సంక్రాంతి ప్రయాణం - గాణగాపురం - అక్కలకోట సందర్శన  సంక్రాంతి పండగ ముగిసింది. ఈసారి కాలేజీకి చాలా సెలవులే ప్రకటించారు. ఎక్కడికైనా ప్రయాణించకుంటే సెలవులు వృధా అయిపోతాయనే ఆరాటం నాకు మొదలయ్యింది. ప్రతి సెలవులలో ఇంట్లో వారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో ఎక్కడికో ఒకచోటికి ప్రయాణించడం నాకు రివాజు.  నేను adventure tourism ను ఇష్టపడకపోవచ్చు గానీ, వినోదాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇష్టపడతాను. హిమాలయాల లాంటి వాటిని నేను ఇంతవరకు దర్శించక పోవడానికి కారణం నాకు రిస్క్ తీసుకునే మనస్తత్వం లేకపోవడమే. నేను సెలవులు వృధా అవుతాయేమో అని ఆలోచిస్తూ ఉండగానే, మిత్రులు ఫోన్ చేసి గాణగాపురం మరియు అక్కలకోట వెళదామా అని అడగడంతో వెంటనే సరే అనేసాను. 16 అర్ధరాత్రి 12.25కు  హోసూర్ express లో బెర్త్ లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నాము. అందరూ అనుకున్న సమాయనికి 'సంక్రాంతి వచ్చిందే తుమ్మెద!!! సరదాలు తెచ్చిందే తుమ్మెద!' అనుకుంటూ ఆనందంగా బయలుదేరాము. ఇక్కడ గాణగాపురం తో నాకున్న స్మృత్యనుబంధాన్ని చెప్పాల...
                                                              నా డిజిటల్ నైపుణ్యాలు  నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉండగా కంప్యూటరు సైన్స్ కోర్సు లకు మా చెడ్డ క్రేజ్ వచ్చి పడింది. మిగిలిన కోర్సులకున్న డిమాండ్ ఉన్న పళంగా అధః పాతాళానికి పడిపోయింది. నేను పీజీ చేసే సమయంలోనైతే కంప్యూటరు కోర్సులకు డిమాండ్ తారా స్థాయికి చేరుకుంది. నేను జువాలజీ లో పీజీ చేస్తున్నానని చెపితే మా బంధువులు కొద్ది మంది నన్ను హీనంగా చూడడం నాకింకా గుర్తుకుంది. అప్పట్లో Y2K సమస్య ఉండడం వలన కంప్యూటరు రంగానికి అలవి కాని డిమాండ్ ఏర్పడింది. అప్పట్లో చిన్న చిన్న కంప్యూటరు సెంటర్ల లో డిప్లొమా కోర్సులు చేసినవారు కూడా క్రౌంచ ద్వీపానికి విమానం ఎక్కి వలస వెళ్లి పోయారు. కంప్యూటరు కోర్సు చేసిన వారికి చిన్న వయసులోనే పెద్ద, పెద్ద ఉద్యోగాలు వచ్చాయి అప్పట్లో.  కంప్యూటరు కోర్సు చేసినవారు డాలర్లలో సంపాదించడం మొదలుపెట్టిన రోజులు అవి. యువత purchasing parity పెరిగిపోవడంతో బజార్లన...
  పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుభవాలు   1991 లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం లో పీజీ చేరడానికి ప్రవేశ పరీక్షలు రాసాను. మైక్రో బయాలజీ , బయోకెమిస్ట్రీ మరియు జువాలజీ మూడింటికీ ప్రవేశ పరీక్షలు రాసాను. అప్పట్లో డిగ్రీ మార్క్స్ కు కూడా వెయిటేజ్ ఉండడం వలన నాకు దేని లోనూ సీట్ రాలేదు. అంతా మన మంచికే అనే విజ్ఞత అప్పుడు లేదు కాబట్టి, బాగా బాధ పడ్డాను. అంతలో మా మేనమామ వరద రాజులు ప్రోత్సాహం వలన RC Reddy ఇన్స్స్టిట్యూట్ లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ చేరిపోయాను. మా మామకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ లో బేగంపేట విమానాశ్రయం లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పనిచేసేవాడు. నేను మా మామ గదిలో ఉండి చదువుకునేటప్పుడే నాతో పాటుగా శివ నారాయణ స్వామి కూడా ఉండేవాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో DSP గా విధులు నిర్వహిస్తున్నాడు. లెక్కల్లో దిట్ట. రవిచంద్రన్ అని మరో సహచరుడు ఉండేవాడు. అతనికి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఇతను కూడా గణితం లో విశేష ప్రతిభ కలిగిఉండేవాడు. అందుకే వీరివురికి అనేక ఉద్యోగాలు వచ్చాయి. గణితం నేర్చుకుంటే జీవితంలో త...
                        డిగ్రీ విద్యార్థిగా నా అనుభవాలు మరియు అవగాహనా స్థాయి  అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 1988-91 లో  B.Sc BZC English medium లో పూర్తీ చేసుకున్నాను. నా డిగ్రీ చదువు గురించి, నేను చదివిన పాఠ్య పుస్తకాల గురించి చర్విత చర్వణం కాకుండా కొన్ని అంశాలు చెపుతాను. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు లేవు కాబట్టి డిగ్రీ కోర్సుకు మంచి డిమాండ్ ఉండేది. క్రేజ్ కూడా ఉండేది. అందునా B.Sc లో చేరడానికి మంచి పోటీ ఉండేది. ఆర్ట్స్ కళాశాలకు హాస్టల్ ఉండేది కాబట్టి, విద్యార్థులు రాయలసీమ లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరేవారు. కంప్యూటరు రంగం అప్పుడప్పుడే పుంజుకుంటూ ఉంది. మా పిన్నయ్య కొడుకుకు IIT లోనూ, మా బావకు IISc లోనూ, నేను డిగ్రీ చదువుతుండగానే సీట్లు వచ్చేసాయి. వారికి నాకు ఉన్న తేడా అప్పుడే నాకు తెలిసివచ్చింది. వారు పదవ తరగతి లో ఉండగానే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాకుండా, అది ఉన్నతంగా ఉండేలా చూసుకున్నారు. లక్ష్యం విషయం ఈ క్రింది రెండు అంశాలు నా విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి....
                              బాల్యం లో  అనుభవాలు మరియు అభ్యసన పద్దతులు  నేను బాల్యం లో ఇంట్లో, స్కూల్ లో పొందిన అనుభవాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. నేను విద్యార్థి దశ నుంచి టీచర్ గా ఎదుగుతున్న క్రమంలో బోధనా పద్దతులలో వచ్చిన అనేక మార్పులను ప్రత్యక్షంగా చూసాను. వాటి వలన లబ్ధి కూడా పొందాను. టీచర్ గా కొన్ని మార్పులకు నేను కూడా నాంది కూడా పలికాను. విద్యార్థిగా నేను పెను మార్పులు చూడనప్పటికీ, టీచర్ గా లాక్ డౌన్ కాలం లో మెథడాలజీ లో విప్లవాత్మక మార్పులు చూసాను. ఎక్కడిక్కడ అరమరికలు లేకుండా నేను నా వ్యక్తిత్వం లో సరబాట్లు చేసుకున్నాను అంటే దానికి కారణం బాల్యం లో నేను పొందిన అనుభవాలే.  నేను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలోనే చదివాను. ప్రాథమిక స్థాయి వరకు కొన్ని తరగతులు ప్రైవేట్ స్కూల్స్ లో చదివాను. ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు నా విద్యాభ్యాసం చాలా ఆహ్లాదకరంగా జరిగింది. కానీ ఈ కాలం లో కూడా నాకు గణితం కంటిలో నలుసై కూచుంది. గణితాన్ని విద్యార్థులకు కంటిలో నలుసులా కాకుండా, కంటికి కాటుకలా మార్చాల్సిన బాధ్యత ...
Image
                                               భయాలు మరియు భావోద్వేగాలు   భయం లేని మనిషి భూమి మీద ఉండడు. ఆ విషయం తెలియక, ఇది మనకు మాత్రమే పట్టిన జాడ్యమేమో అని మనం భయపడుతుంటాము.  నాకు చిన్నప్పటి నుంచి అకారణ భయాలు చాలా ఉండేవి. వీటిని జయించడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ కొన్ని భయాలు నాలో సూక్ష్మ రూపంలో కొనసాగుతున్నాయి. 'క్షుద్రం హృదయ ధౌర్భల్యం' అని భగవానుడు గీత లో చెప్పాడు కదా!!! ఈ అనవసర భయాల వల్ల నేను జీవితంలో చాలానే పోగొట్టుకున్నాను. వాటి ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, నా స్టూడెంట్స్ వీటి గురించి చదివి అలాంటి భయాలను జయించాలని. తల్లి తండ్రులు కూడా పిల్లలకు భయాన్ని నేర్పకూడదు. భయాన్ని జయించే మార్గాలను అన్వేషించేలా పిల్లలను ప్రోత్సహించాలి.  నాకు కూడా విద్యార్థి దశలో చాలా భయాలు ఉండేవి. దానిలో ప్రధానమైనది స్టేజ్ ఫియర్, అంటే సభా కంపం. అది ఏ స్థాయిలో ఉండేది అంటే పది మంది నా ముందుంటే చాలు నాకు ముచ్చెమటలు పట్టేవి. నేర్చుకున్నది గుర్తుకువచ్చేది కాదు. ఈ భయం ...
                                                                      నా మజిలీలు  గ్రహచారమో, గోచారమో నాకు తెలియదుగానీ పుట్టినప్పటినుంచి నేను ఒక చోట స్థిరంగా ఉండలేదు. నాన్న కు ఉద్యోగరీత్యా రెండేళ్లకు ఒక బదిలీ ఉండేది కాబట్టి నేను చదువుకునే సమయంలో చాలా ఊర్లు మారవలసి వచ్చింది. అలాగే నేను ఉద్యోగించే సమయంలో కూడా చాలా చోట్లకు బదిలీ మీద వెళ్లాను. అలా అని నేను ఎప్పుడూ ఖండాంతరాలు దాటి ప్రయాణించలేదు. అనంతపురం, చిత్తూరు మరియు కడప జిల్లాలకు నా మజిలీలు పరిమితం అయ్యాయి. ప్రతి మజిలీ నాలో అనేక మార్పులను తీసుకొచ్చింది. ప్రతి మజిలీ నాకు ఎన్నో అనుభవాలను పంచి పెట్టింది. ప్రతి చోట నన్ను నేను మార్చుకోవడమో లేక ఇతరులను ఏమార్చడమో జరిగింది. ఎక్కడికక్కడ నా వ్యక్తిత్వం లో సర్దుబాటు చేసుకున్నాను. నాన్న బదిలీల వలన నాకు Change management కొద్దివరకు అలవాటు అయిపోయింది. నాలోనికి నావి కానివి ఇప్పటికి చాలానే ప్రవేశించి ఉంటాయి. అసలు ఇప్పుడు నాదంటూ...
Image
                                                       అనంతపురం ఆర్ట్స్ కళాశాల  నేను పుట్టి పెరిగిన అనంతపురం లో నాకు నచ్చిన ప్రదేశాలు రెండు. అవి ఒకటి ఆర్ట్స్ కాలేజీ, మరొకటి దాని పక్కనే ఉన్న విశాలాంధ్ర. విశాలాంధ్ర గురించి నేను కోరా లో రాసేశాను కాబట్టి ఇక ఇక్కడ ఆ ముచ్చట పెట్టుకోను.  మా ఆర్ట్స్ కళాశాల ఆషామాషీ కళాశాల కాదు. వంద సంవత్సరాల పై చిలుకు చరిత్ర ఉన్న విద్యాలయం. ఇచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టు, ఇక్కడ చదువుకున్నా, పని చేసినా, ఆ పొగరే వేరు. ఈ క్యాంపస్ లో వీచే గాలిలోనే ఏదో మహత్యం ఉంది. మా నాన్న తో సహా మా బంధువులందరూ ఈ కాలేజీ లోనే చదువుకున్నారు. మా కాలేజీ ప్రాంగణం చాలా పెద్దది. సుమారుగా 46 తరగతి గదులు ఉంటాయి. దానిలో కొన్ని గాలెరీలు. ఇప్పుడైతే  కొన్ని తరగతులు డిజిటల్ సొబగులు అద్దుకున్నాయి. ఇవి కాక ప్రయోగశాలలు, హెల్త్ సెంటర్, కాంటీన్ , లైబ్రరీ లాంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి. విభాగాల ముందు పొడవైన కారిడార్లు చూస్తే , రాజ ప్రాసాదా...
                                             నా జూనియర్ కాలేజీ కథా కమామిషు  నేను అత్తెసరు మార్కులతో పదవ తరగతి పాస్ అయినప్పటికీ, నాకు Bi.P.C ఇంగ్షీషు మీడియం లో సీటు వచ్చింది. నా ఇంటర్ విద్యా సంవత్సరం 1986-88. నేను మొదట తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చేరాను. అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రం వదిలేస్తే, ఆంగ్ల మాధ్యమం ఒక్క తాడిపత్రి లో మాత్రమే ఉండడం నా అదృష్టం. అప్పుడు మా కాలేజీ ప్రిన్సిపల్ వీరారెడ్డి. పీలగా ఉన్నా కూడా నాకు ఆయనను చూస్తే ఏదో తుత్తరగా ఉండేది. ప్రిన్సిపల్ గా ఉన్నా కూడా ఆయన మాకు జువాలజీ క్లాసులు తీసుకునే వాడు. నాకు బాగా గుర్తు ఏమంటే వీరారెడ్డి గారు మాకు మలేరియా పరాన్నజీవి జీవిత చక్రం ఆంగ్లం లో చెపుతూ, 'Liver ను తెలుగులో ఏమంటారు?' అని అడిగాడు. ఆయనను చూస్తే నాకున్న భయం తో నేను 'ఊపిరితిత్తి ' అని జవాబు చెప్పడంతో ఆయన ఖంగు తిన్నాడు. అలాగే మా తెలుగు మాస్టారు 'ఏదైనా ఒక వేదం పేరు చెప్పండి' అని అడిగితే, ఒక బడుద్ధాయి 'ఆయుర్వేదం' అన్నాడు. మా తెలుగు మాస్టారుకు వాడి స...
                                                                  విద్యార్థి గా నేను  నేను అందరి లాగా బుద్ది కుశలత ఉన్న విద్యార్థి నైతే కాదు. నిజానికి బుద్ది కుశలత లేకపోగా బుద్ది జాడ్యం కూడా ఉండేదేమో అని నాకు అనుమానం. ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు అనంతపురం లో ఉన్న వివేకానందా విద్యా మందిర్ లో చదివాను. ఇప్పుడు ఆ స్కూల్ ఎక్కడికి పోయిందని నన్నడక్కండి. ఉపాధ్యాయులు బాగానే చెప్పేవారు. ఈ స్కూల్ లో నాకు ఉపాధ్యాయులు పెట్టిన ఒక పోటీ ఎప్పుడూ గుర్తుకు వచ్చి నవ్వు వస్తూనే ఉంటుంది. ఒక సారి మాకు వర్ణమాల లో 'అ' నుంచి 'అః ' వరకు రాయమని పోటీలు పెట్టారు. ఎవరు ముందుగా రాస్తే వారికి మొదటి బహుమతి అని మా టీచర్లు చెపితే నేను అందరికంటే ముందే రాసి తీసుకువెళ్ళాను. కానీ ఆ హడావుడి లో 'ఉ ' మరియు 'ఊ' అనే రెండు అక్షరాలు ఎగరకొట్టేసాను. నాకు ఏ బహుమతి ఇవ్వాలో తెలియక మా అయ్యవార్లు మల్ల గుల్లాలు పడి రెండవ బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి గా కోడి బొచ్చు నెత్తి మీ...