Posts

Showing posts from March, 2025
Image
మనుషులలో మనసున్న మారాజులు కొందరే ఉంటారు. అలాంటి మారాజు గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ మహరాజు పేరు జయరామి రెడ్డి. నేను కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2021 - 2023 మధ్య కాలంలో  పనిచేసేటప్పుడు మా ప్రిన్సిపాల్ ఈయన.  2002 లో నాకు లెక్చరర్ గా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి, నేను తొమ్మిది మంది  ప్రిన్సిపాల్స్ క్రింద పనిచేశాను. వాళ్లందరిలో నాకో comfort zone ఇచ్చిన ప్రిన్సిపాల్ జయరామి రెడ్డి. మామూలుగా ప్రిన్సిపల్ అన్న వెంటనే ఏదో ఒక సమయంలో సూక్ష్మ రూపంలో అయినా సరే దర్పం తొంగి చూస్తుంది. కానీ జయరామి రెడ్డి గారికి దర్పం అంటే ఏమిటో అసలు తెలియదు. "కాఠిన్యానికి ఒంగవు శిరస్సులు, కారుణ్యానికి ఒంగుతాయి .. .....అనురాగం చేసే శాసనమే అసలైన రాజనీతి " అని నమ్మిన అధికారి మా సర్. చూడడానికి మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి లాగా ఉంటాడు. నేలకు దిగిన చందమామ లాగా వెన్నెల కురిపిస్తాడు. జయరామి రెడ్డి ప్రిన్సిపల్ గా పనిచేసిన కాలం మాకు చరిత్రలో గుప్త రాజుల కాలంలా ఒక స్వర్ణ యుగం. పరిపాలనా దక్షత మరియు విజ్ఞత కలగలిపి పోత పోస్తే ఆయన రూపు తీసుకుందేమో అన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహార శైలి.  జయరామిరెడ్డి గా...