Posts

Image
                                                              ఒంగోలు ప్రయాణం  అధ్యాపకులందరము విద్యార్థి దశలోకి వెళ్ళిపోయిన అనుభూతి ఈ రోజు వచ్చింది. Association elections  రాష్ట్ర స్థాయిలో ఒంగోలు సక్కూ భాయి మహిళా డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 9, 2025 న జరగబోతున్నాయి. ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అనంతపురం జిల్లా నుంచి 30 మంది  వరకు అధ్యాపకులు ఒంగోలుకు ఫిబ్రవరి 8 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరాము. ప్రయాణానికి ఏర్పాటు చేసిన బస్సు చాలా సౌకర్యవంతంగా ఉంది. నేను అందరికంటే ముందుగా వెళ్లి సింగల్ సీట్ లో కూచుండి పోయాను. చేతిలో ఒక బ్యాగ్ తప్ప ఎవరికీ పెద్ద లగేజ్ లేదు. బస్సు ఎక్కడానికి ముందే అందరూ blissful mood లోకి వచ్చేసారు. ఈ టూర్ మొత్తం మనోహర్ రెడ్డి, శేషయ్య మరియు సోమశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తోంది. బయలుదేరడానికి ముందు రోజే నేను గూగుల్ లో ఒంగోలు చుట్టుపట్ల ఉన్న ప్రదేశాల గురించి వెతికి పట్టుకున్నాను. ఎక్కడికి ...
Image
ఫిబ్రవరి 2 , 2025  నాకు ఒక మరపురాని మధురానుభూతిని పంచింది. దానికి కారణం నేను రాళ్లపల్లి లో జరగబోతున్న రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడమే.  నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినది రాళ్లపల్లి వాస్తవ్యుడైన కృష్ణ మోహన్ రెడ్డి. ఈయన ఇంజనీర్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే, గ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నారు. కృష్ణ మోహన్ గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వెంటనే నేను ఎగిరిగెంతేసి ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి పేరు వింటూనే ఉన్నాను. ఆయన నా బాల్యం లో మా ఇంటికి వచ్చేవారని మా తాత చెప్పేవారు. నేను మరీ చిన్న వాడిని కావడంతో ఆయనను భౌతికంగా చూసిన గుర్తుకులేదు. నేను ఇంటర్ లో ఉండగా మా తెలుగు పాఠ్య పుస్తకం లో రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రాసిన 'నిగమ శర్మ అక్క' పాఠం ఉండేది. దానిలో ఉన్న 'పరిహాసము పవిత్ర వస్తువును కూడా గమనించదేమో' అనే వాక్యం నాకిప్పటికీ గుర్తు. అదే విధంగా నేను తిరుపతి లో ఉన్నప్పుడు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు అన్నమయ్య సంకీర్తనలలో 108 కీర్తనలకు సంగీతాన్ని...
Image
                                                        తిరుపతి తో నా అనుబంధం  తిరుపతి లో నేను రెండు విడతలుగా సుమారు పదిహేను సంవత్సరాల పాటు నివాసం ఉన్నాను. మొదటిసారి 1991 నుంచి 1995 వరకు ఉన్నాను. తరువాత 1999 నుంచి 2010 వరకు రెండో విడత ఉన్నాను. ఇంత కాలం పాటు తిరుపతి లాంటి పుణ్య క్షేత్రంలో నెలవు ఉండడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఆదిత్య పురాణం లో చెప్పిన  ' వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనా- వెంకటేశ సమో దేవా నభూతో న భవిష్యతి ' అనే ప్రమాణం నాకు జీవితంలో అనుభూతిలోకి వచ్చింది.  చిన్నప్పటి నుంచి మా కుటుంబానికి తిరుమల శ్రీవారి ని దర్శించడం రివాజు. ఇంచు మించు డిగ్రీ చదువుకునే వరకు నేను ఏదో ఒక రకంగా, ఎవరో ఒకరితో ఏడాదికి ఒకసారి చొప్పున శ్రీవారి దర్శనం చేసుకుని ఉంటాను. మా ఇలవేల్పు వెప్రగల్ నరసింహ స్వామి. దీనిని ఇప్పుడు విప్రమల అంటున్నారు. రాయదుర్గం దగ్గరగా ఉన్న క్షేత్రం ఇది. కానీ మాకు కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని ...
Image
                                సంక్రాంతి ప్రయాణం - గాణగాపురం - అక్కలకోట సందర్శన  సంక్రాంతి పండగ ముగిసింది. ఈసారి కాలేజీకి చాలా సెలవులే ప్రకటించారు. ఎక్కడికైనా ప్రయాణించకుంటే సెలవులు వృధా అయిపోతాయనే ఆరాటం నాకు మొదలయ్యింది. ప్రతి సెలవులలో ఇంట్లో వారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో ఎక్కడికో ఒకచోటికి ప్రయాణించడం నాకు రివాజు.  నేను adventure tourism ను ఇష్టపడకపోవచ్చు గానీ, వినోదాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇష్టపడతాను. హిమాలయాల లాంటి వాటిని నేను ఇంతవరకు దర్శించక పోవడానికి కారణం నాకు రిస్క్ తీసుకునే మనస్తత్వం లేకపోవడమే. నేను సెలవులు వృధా అవుతాయేమో అని ఆలోచిస్తూ ఉండగానే, మిత్రులు ఫోన్ చేసి గాణగాపురం మరియు అక్కలకోట వెళదామా అని అడగడంతో వెంటనే సరే అనేసాను. 16 అర్ధరాత్రి 12.25కు  హోసూర్ express లో బెర్త్ లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నాము. అందరూ అనుకున్న సమాయనికి 'సంక్రాంతి వచ్చిందే తుమ్మెద!!! సరదాలు తెచ్చిందే తుమ్మెద!' అనుకుంటూ ఆనందంగా బయలుదేరాము. ఇక్కడ గాణగాపురం తో నాకున్న స్మృత్యనుబంధాన్ని చెప్పాల...
                                                              నా డిజిటల్ నైపుణ్యాలు  నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉండగా కంప్యూటరు సైన్స్ కోర్సు లకు మా చెడ్డ క్రేజ్ వచ్చి పడింది. మిగిలిన కోర్సులకున్న డిమాండ్ ఉన్న పళంగా అధః పాతాళానికి పడిపోయింది. నేను పీజీ చేసే సమయంలోనైతే కంప్యూటరు కోర్సులకు డిమాండ్ తారా స్థాయికి చేరుకుంది. నేను జువాలజీ లో పీజీ చేస్తున్నానని చెపితే మా బంధువులు కొద్ది మంది నన్ను హీనంగా చూడడం నాకింకా గుర్తుకుంది. అప్పట్లో Y2K సమస్య ఉండడం వలన కంప్యూటరు రంగానికి అలవి కాని డిమాండ్ ఏర్పడింది. అప్పట్లో చిన్న చిన్న కంప్యూటరు సెంటర్ల లో డిప్లొమా కోర్సులు చేసినవారు కూడా క్రౌంచ ద్వీపానికి విమానం ఎక్కి వలస వెళ్లి పోయారు. కంప్యూటరు కోర్సు చేసిన వారికి చిన్న వయసులోనే పెద్ద, పెద్ద ఉద్యోగాలు వచ్చాయి అప్పట్లో.  కంప్యూటరు కోర్సు చేసినవారు డాలర్లలో సంపాదించడం మొదలుపెట్టిన రోజులు అవి. యువత purchasing parity పెరిగిపోవడంతో బజార్లన...
  పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుభవాలు   1991 లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం లో పీజీ చేరడానికి ప్రవేశ పరీక్షలు రాసాను. మైక్రో బయాలజీ , బయోకెమిస్ట్రీ మరియు జువాలజీ మూడింటికీ ప్రవేశ పరీక్షలు రాసాను. అప్పట్లో డిగ్రీ మార్క్స్ కు కూడా వెయిటేజ్ ఉండడం వలన నాకు దేని లోనూ సీట్ రాలేదు. అంతా మన మంచికే అనే విజ్ఞత అప్పుడు లేదు కాబట్టి, బాగా బాధ పడ్డాను. అంతలో మా మేనమామ వరద రాజులు ప్రోత్సాహం వలన RC Reddy ఇన్స్స్టిట్యూట్ లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ చేరిపోయాను. మా మామకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ లో బేగంపేట విమానాశ్రయం లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పనిచేసేవాడు. నేను మా మామ గదిలో ఉండి చదువుకునేటప్పుడే నాతో పాటుగా శివ నారాయణ స్వామి కూడా ఉండేవాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో DSP గా విధులు నిర్వహిస్తున్నాడు. లెక్కల్లో దిట్ట. రవిచంద్రన్ అని మరో సహచరుడు ఉండేవాడు. అతనికి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఇతను కూడా గణితం లో విశేష ప్రతిభ కలిగిఉండేవాడు. అందుకే వీరివురికి అనేక ఉద్యోగాలు వచ్చాయి. గణితం నేర్చుకుంటే జీవితంలో త...
                        డిగ్రీ విద్యార్థిగా నా అనుభవాలు మరియు అవగాహనా స్థాయి  అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 1988-91 లో  B.Sc BZC English medium లో పూర్తీ చేసుకున్నాను. నా డిగ్రీ చదువు గురించి, నేను చదివిన పాఠ్య పుస్తకాల గురించి చర్విత చర్వణం కాకుండా కొన్ని అంశాలు చెపుతాను. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు లేవు కాబట్టి డిగ్రీ కోర్సుకు మంచి డిమాండ్ ఉండేది. క్రేజ్ కూడా ఉండేది. అందునా B.Sc లో చేరడానికి మంచి పోటీ ఉండేది. ఆర్ట్స్ కళాశాలకు హాస్టల్ ఉండేది కాబట్టి, విద్యార్థులు రాయలసీమ లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరేవారు. కంప్యూటరు రంగం అప్పుడప్పుడే పుంజుకుంటూ ఉంది. మా పిన్నయ్య కొడుకుకు IIT లోనూ, మా బావకు IISc లోనూ, నేను డిగ్రీ చదువుతుండగానే సీట్లు వచ్చేసాయి. వారికి నాకు ఉన్న తేడా అప్పుడే నాకు తెలిసివచ్చింది. వారు పదవ తరగతి లో ఉండగానే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాకుండా, అది ఉన్నతంగా ఉండేలా చూసుకున్నారు. లక్ష్యం విషయం ఈ క్రింది రెండు అంశాలు నా విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి....