మనుషులలో మనసున్న మారాజులు కొందరే ఉంటారు. అలాంటి మారాజు గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ మహరాజు పేరు జయరామి రెడ్డి. నేను కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2021 - 2023 మధ్య కాలంలో  పనిచేసేటప్పుడు మా ప్రిన్సిపాల్ ఈయన.  2002 లో నాకు లెక్చరర్ గా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి, నేను తొమ్మిది మంది ప్రిన్సిపాల్స్ క్రింద పనిచేశాను. వాళ్లందరిలో నాకో comfort zone ఇచ్చిన ప్రిన్సిపాల్ జయరామి రెడ్డి. మామూలుగా ప్రిన్సిపల్ అన్న వెంటనే ఏదో ఒక సమయంలో సూక్ష్మ రూపంలో అయినా సరే దర్పం తొంగి చూస్తుంది. కానీ జయరామి రెడ్డి గారికి దర్పం అంటే ఏమిటో అసలు తెలియదు. "కాఠిన్యానికి ఒంగవు శిరస్సులు, కారుణ్యానికి ఒంగుతాయి .. .....అనురాగం చేసే శాసనమే అసలైన రాజనీతి " అని నమ్మిన అధికారి మా సర్. చూడడానికి మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి లాగా ఉంటాడు. నేలకు దిగిన చందమామ లాగా వెన్నెల కురిపిస్తాడు. జయరామి రెడ్డి ప్రిన్సిపల్ గా పనిచేసిన కాలం మాకు చరిత్రలో గుప్త రాజుల కాలంలా ఒక స్వర్ణ యుగం. పరిపాలనా దక్షత మరియు విజ్ఞత కలగలిపి పోత పోస్తే ఆయన రూపు తీసుకుందేమో అన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహార శైలి. 

జయరామిరెడ్డి గారు staff meeting పెడితే, అది గంటలోపు ముగిసి పోయేది. ఎక్కడో చదివాను "Staff meeting loses hours to keep minutes" అని. కానీ ఈయనకున్న సమయజ్ఞత అంతా ఇంతా కాదు. సుధీర్ఘ మైన మీటింగులు జరపడం ఆయనకు ఇష్టముండేది కాదు. అధ్యాపకులను ఆయన ఏ రోజు ఒత్తిడికి గురిచేసింది లేదు. అసలు ఆయన తో కలిసి పనిచేయడమే ఒక stress buster. విద్యార్థులను కూడా మందలించడం లో చాలా ఆచి తూచి మెలిగేవాడు. జయరామి రెడ్డి గారి ఆధ్వర్యం లో కల్యాణదుర్గం కళాశాలకు రెండో పర్యాయం నాక్ B గ్రేడ్ వచ్చింది. నాక్ కోసం పనిచేసేటప్పుడు కూడా ఎవరినీ ఒత్తిడికి గురిచేసింది లేదు ఆయన. ప్రయత్నం మీద ధ్యాస పెట్టడం ఆయనకు తెలుసు గానీ, ఫలితం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడడం ఆయన వైఖరి కాదు. మేము కలిసి పనిచేసింది కేవలం ఒక సంవత్సరం ఎనిమిది నెలలు. కొన్ని వందల కార్యక్రమాలు అవలీలగా చేసేసాము. చుట్టు పట్ల గుళ్లు, గోపురాలు, తోటలు కలతిరిగేసాము. కల్యాణదుర్గం నిండా ఆయన స్టూడెంట్లే ఉన్నారు. వాళ్ళల్లో అధికారులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు. మేము ఏ టీ బంకు దగ్గర నిలుచున్నా, ఆయన స్టూడెంట్స్ వచ్చి పలకరించేవారు. ఆయన కున్న net work మరియు net worth మరెవరికీ  ఉండవు. 

నా వరకు జయరామి రెడ్డి గారు ఒక management Guru. భేషజం లేని పెద్ద మనిషి. కారులో పాటలు వినుకుంటూ ప్రయాణించేవాళ్లము. సినిమా హీరో కృష్ణ అభిమాని ఈయన. మంచి sense of humour ఉన్న వ్యక్తి. చాలా సార్లు కళాశాలలో blood donation camps ఆయన ఆధ్వర్యం లో జరిగాయి. చాలా మంది డాక్టర్లు జయరాం సర్ కు పరిచయం. టూరిజం సర్ కు ఉన్న ఒక మంచి హాబీ. అమెరికా అంటే చాలా ఇష్టం అని సర్ మాటల్లో నాకు తెలిసింది. జయరామి రెడ్డి గారి ఆధ్వర్యం లో కల్యాణదుర్గం లో జరిగిన కార్యక్రమాలు కొన్ని సచిత్రంగా ఇక్కడ ఏకరువు పెడుతున్నాను. 'నూటికో, కోటికో ఒక్కరూ, ఎక్కడో ఎప్పుడో పుడతారు' అనే పాట మా జయరామి రెడ్డి గారికి సరిగా అతుకుతుంది. అహం బరువు మోయని సహన శీలి మా ప్రిన్సిపల్ జయరామి రెడ్డి. ఈ ఉగాదికి ఆయన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా, పైన చెప్పినట్లుగా జ్ఞాపకాలను సచిత్రంగా పంచుకుంటున్నాను. 


ప్రతి మలుపు ఒక గెలుపుగా మారాలని విద్యార్థులను ఆశీర్వదిస్తూ 

విద్యార్థులలో సామాజిక స్పృహ పెంచుతూ 
Fashion designing course inauguration సందర్భంగా 
నవ్వడమే ఒక యోగం మా సర్ కు 
వరుస కార్యక్రమాలు.. ఒకటా, రెండా.. పదులా వందా 

తోటి ప్రిన్సిపల్స్ తో 

నాకు మరో అదృష్టం ఏమంటే నేను, మా జయరామి రెడ్డి సర్ కలిసి కొన్ని పదుల సమీక్షా సమావేశాలకు హాజరై ఉంటాము. వెళ్లిన ప్రతి సారి ఏదో ఒక కొత్త ప్రదేశం చూసి వచ్చే వాళ్లం. ఒకసారి ఇలాగే తిరుపతి సమీక్షా సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు, మధ్య దావలో కారు గుంతలో దింపేసాను. టైరు పేలిపోయింది. వెంటనే జాకీ తీసి , నేను బిత్తర చూపులు చూస్తూ ఉంటే క్షణాలలో టైరు మార్చడం నాకు ఇంకా గుర్తే. సర్ బర్త్ డే ని కారు మధ్యలో తోటలో ఆపి కేకు కట్ చేసి జరిపాము. అది జరిగిన నెలకే మేమో నలుగురు అధ్యాపకులు బదిలీ మీద అనంతపురం తిరిగి రావడం కాలం చేసిన జిమ్మిక్కు. సర్ ను చూస్తే age is just number అనిపిస్తుంది. 

                                          విద్యార్థులే నా దేవుళ్లు అంటూ మా ప్రిన్సిపల్ 

                                                             కరోనా టీకా డ్రైవ్ లో 

                                                  (అ) పూర్వ విద్యార్థులతో మా ప్రిన్సిపల్ 

ఈయన కాలేజీ లో ఉంటే ఎప్పుడూ ఉగాదులే, ఎప్పుడూ ఉషస్సులే 



'జయ.. జయ' ధ్వానాలు చేస్తూ మా విద్యార్థులు 

Earning while learning ను ప్రోత్సహిస్తూ మా ప్రిన్సిపల్ 

Fine moments in food festival 

ప్రతి క్షణం, సరస్వతీ వీక్షణం 



గ్రూప్ I విజేత డాక్టర్ శ్రీ లేఖ గారిని అభినందిస్తూ ప్రిన్సిపల్ జయరామి రెడ్డి 





అనాథ ఆశ్రమానికి బియ్యం వితరణ చేస్తూ. 
జయరామి రెడ్డి గారి చుట్టూ చేరిన అభిమాన ధనులు 








చూసారుగా .. మేము ఆయన ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు. నేను జయరామిరెడ్డి గారి నుంచి నేర్చుకున్న మెళుకువలు క్రింద పేర్కొంటున్నాను. 

  • Crisis management 
  • Time management 
  • Resource management 
  • Emotion management 
  • Selection of right words while speaking 
ఇన్ని మెళుకువలను నాలాంటి వారికి నేర్పిన మా జయరామి రెడ్డి గారికి పదవీ విరమణ తరువాత జీవితం ఉజ్వలంగా ఉండాలని ఆ శ్రీనివాస పరబ్రహ్మను ప్రార్థిస్తున్నాను. 

      జయోస్తు .. విజయోస్తు 
























Comments

Popular posts from this blog