నా వ్యక్తిగత బ్లాగ్ కు స్వాగతం. వృత్తికి సంబంధించిన అంశాలు కాకుండా ప్రవృత్తికి సంబంధించిన అంశాలు, ప్రయాణాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. కలిసి ప్రయాణిద్దాం. సిద్దం కండి. నా జీవితం లో నేను మనస్పూర్తిగా ఇష్టపడిన అంశాలు:

  • ప్రయాణాలు 
  • పుస్తకాలు 
  • అనుబంధాలు
సాదాసీదా విద్యార్థిగా ఉన్న నేను, ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మక డిగ్రీ కళాశాల లో ఒక గురువుగా ఎదగగలిగాను. దీని వెనుక నా కృషి కన్నా తల్లి, తండ్రుల ఆశీర్వచనాలు, శ్రేయోభిలాషుల నిర్మాణాత్మక సహకారం, సలహాలు ఉన్నాయి. నా జీవితం లో వైఫ్యల్యాలు వేగంగా వచ్చాయి. విజయాలు చాలా నెమ్మదిగా వచ్చాయి. తొందరపాటు నిర్ణయాలు చాలానే తీసుకున్నాను. అవి అనుభవం లాగా మిగిలిపోయాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచించింది లేదు, పశ్చాత్తాప పడింది పెద్ద లేదు. చేసిన తప్పుల దగ్గరే ఆగిపోయి, చింతిస్తూ కూచుంటే, ముందుకు ప్రయాణించలేము. అందునా ఉన్నది ఒక్కటే జిందగీ. జన్మలు, పునర్జన్మలు ఉన్నాయో, లేవో మనకు తెలియదాయే!!!! కాబట్టి తప్పొప్పుల పట్టికను తయారుచేసుకుని నేను చింతించింది లేదు. అయ్యిందేదో అయ్యింది అనుకుంటూ సాగిపోయాను. ఈ బ్లాగ్ లో నా విజయాలు, అపజయాలు, ప్రయాణాలు, భావోద్వేగాలు పంచుకుంటాను. అంతే. 

వీలైతే బ్లాగ్ ను follow కండి. 


Comments

Post a Comment